Site icon NTV Telugu

కార్తికేయ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్…!

Kartikeya thrilling look from Raja Vikramarka Movie

యంగ్ హీరో కార్తికేయ శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ లో నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ ను ఈరోజు విడుదల చేశారు మేకర్స్. ఈ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్‌ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సంచలనాత్మక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేశారు. “రాజా విక్రమార్క” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కార్తికేయ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కార్తికేయ డైనమిక్ గా, మ్యాన్లీగా కనిపిస్తున్నాడు.

Also Read : హీరోయిన్ తో సహజీవనం, మోసం… మంత్రి అరెస్ట్

వి. వి. వినాయక్ శిష్యుడైన శ్రీసరిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని డబుల్ ఎయిట్ రామరెడ్డి నిర్మిస్తున్నారు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మరో యువ నటుడు సుధాకర్ కోమాకుల ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాడు. ప్రశాంత్ ఆర్ విహారి దీనికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

Exit mobile version