NTV Telugu Site icon

Karthi : ఓటీటీలో ‘సత్యం సుందరం’..ఎప్పుడు ఎక్కడంటే..!

Karhti

Karhti

హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో వచ్చిన హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంవహించారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు.సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కుటుంబ బంధాలను విలువలు తెలియాజేస్తూ బావ బావమరుదులుగా కార్తీ, అరవింద్ స్వామి లు ప్రేక్షకులతో కంటతడి పెట్టించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయగా గోవింద్ వసంత్ సంగీతం ఆకట్టుకుంది.

Also Read : JR. NTR : కాస్త తగ్గిన దేవర.. ఇప్పటికి ఎన్ని కోట్లు లాభమంటే..?

థియేటర్ రన్ ముగించుకున్న సత్యం సుందరం ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. రిలీజ్ కు ముందుగానే ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్. సత్యం సుందరం ను డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ చేస్తోంది నెట్ ఫ్లిక్స్, ముందుగా చేసుకున్న అగ్రుమెంట్ ప్రకారం సత్యం సుందరం ఈ అక్టోబరు 25న అన్ని భాషల్లో ప్రముఖ OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. థియేటర్ రిలీజ్ లో ప్రశంసలతో పాటు మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం OTT రాక కోసం ఎదురు చూస్తున్నారు. సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంతో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 60 కోట్లకు పైగా కలక్షన్స్ రాబట్టింది. సత్యం సుందరం సక్సెస్ తో జోష్ లో ఉన్న కార్తీ ప్రస్తుతం సర్దార్ – 2 తో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఖైదీ -2 లోను నటిస్తున్నాడు.

Show comments