NTV Telugu Site icon

Karthi : కాస్త పబ్లిసిటీ చేయండి ‘బాబు’.. రిలీజ్ అవుతున్నట్టే తెలియదు..

Untitled Design (15)

Untitled Design (15)

తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇటీవల రిలిజ్ అయిన ఈ చిత్ర టీజర్ మంచి ప్రసంశలు అందుకుంది. కార్తీ, అరవింద్ స్వామి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ, డిఫరెంట్ లైఫ్ స్టయిల్ లో టీజర్ కట్ చేసిన విధానం ఆకట్టుకుంది. కార్తీ అమాయకత్వంతో కూడిన రస్టిక్ క్యారెక్టర్ చేస్తే, అరవింద్ స్వామి రిజర్వ్‌డ్, అర్బన్ పర్సనాలిటీ గా కనిపించారు. 96లో డ్రామాని డీల్ చేయడంలో తన సత్తా చాటిన సి ప్రేమ్ కుమార్ లీడ్ రోల్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు.

Also Read : GOAT : 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు గట్టి దెబ్బే..

కాగా  ఈసినిమాను మొదట సెప్టెంబరు 27న రిలీజ్ ప్రకటించారు. కానీ ఆ రోజు దేవర ఉండడంతో ఒకరోజు గ్యాప్ తో రిలీజ్ డేట్ వేశారు. దేవర తో పాటు విడుదల కావడం ఓ మైనస్ అనుకుంటే, అస్సలు ప్రచారం అన్నదే పట్టించుకోకపోవడం అసలు సిసలు మైనస్ గా కనిపిస్తోంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై సురేష్ బాబు, ఏషియన్ సునీల్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సత్యం సుందరం సెప్టెంబర్ 28న విడుదల కానుంది. రిలీజ్ కు పట్టుమని వారం లేదు కానీ ఇప్పటికి ప్రమోషన్స్ అనేవి మొదలే పెట్టనే లేదు, ఒకే ఒక పోస్టర్ రిలీజ్ చేసి చేతులు దులుపు కున్నారు రైట్స్ కొనుకోలు చేసిన మేకర్స్. తమిళ నిర్మాత డైరక్ట్ గా విడుదల చేసుకున్నా ఓ ప్రెస్ మీట్ లేదా ఓ ఈవెంట్ చేసి సినిమాను కాస్త ఆడియన్స్ లోకి తీసుకెళ్లే వారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిస్తున్నాయి

Show comments