Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Karnisena Warning To Pushpa 2 Makers Over Shekhawat Name

Pushpa-2 Controversy: పుష్ప- 2కి షెకావత్ కష్టాలు.. దాడులు చేస్తామంటూ కర్ణిసేన వార్నింగ్

Published Date :December 10, 2024 , 4:18 pm
By Bhargav Chaganti
Pushpa-2 Controversy: పుష్ప- 2కి షెకావత్ కష్టాలు.. దాడులు చేస్తామంటూ కర్ణిసేన వార్నింగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి వ్యతిరేకంగా కర్ణి సేన రంగంలోకి దిగింది. సినిమాలో ఫహద్ ఫాజిల్ పేరుకు సంబందించి కర్ణి సేన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ పదాన్ని ‘పుష్ప 2’ నుండి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కర్ణి సేన నాయకుడు రాజ్ షెకావత్ ఒక వీడియో విడుదల చేసి ‘పుష్ప 2’ నిర్మాతలను బహిరంగంగా హెచ్చరించాడు. నిర్మాతలు ‘క్షత్రియ’ సమాజాన్ని అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘పుష్ప 2’ సినిమాలో ‘షెకావత్’ అనే పదాన్ని ఉపయోగించడంపై రాజ్ షెకావత్ మండిపడ్డారు. అలా చేయడం ద్వారా ఈ సినిమా ‘క్షత్రియ సమాజాన్ని ఘోరంగా అవమానించిందని’ వారు ఆరోపించారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన షెకావత్‌ను విలన్ గా చూపించారని పేర్కొన్నారు.

Pushpa 2 : పుష్ప 2 స్టిల్స్ తో ఆప్- బీజేపీ పోస్టర్ వార్..

భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో సినీ పరిశ్రమ ఏళ్ల తరబడి క్షత్రియుల పరువు తీస్తూనే ఉందని ఆయన అన్నారు. “ చెవులు రిక్కించి వినండి, సినిమాలో ఈ క్రింది విధంగా ఉపయోగించిన ‘షెకావత్’ పదాన్ని తీసివేయాలి. లేకుంటే కర్ణి సేన కూడా దాడులు చేస్తుంది, ఇళ్లలోకి ప్రవేశిస్తుంది, అవసరమైతే ఎంతకైనా తెగిస్తుంది.” అని ఆయన హెచ్చరించారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప 2’ చిత్రంలో, విలన్ పేరు భన్వర్ సింగ్ షెకావత్, అతని పాత్రను మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ పోషించారు. అతని పాత్ర నెగిటివ్‌గా చూపబడడంతో కర్ణి సేన అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా నుంచి షెకావత్ ఇంటిపేరు తొలగించాలన్నది వారి డిమాండ్. ఇప్పుడు ఈ మొత్తం విషయంపై మేకర్స్ నుండి స్పందన ఇంకా రాలేదు. అయితే ఈ సినిమా డైరెక్షన్ టీంలో ఉన్న వీరేంద్ర సింగ్ షెకావత్ అనే వ్యక్తి పేరుతోనే ఈ షెకావత్ పేరును సృష్టించామని సుకుమార్ తాజాగా సక్సెస్ మీట్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Karnisena Warning
  • pushpa 2
  • Shekhawat

తాజావార్తలు

  • Mrunal Thakur : డెకాయిట్‌లో రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేశా!

  • CM Chandrababu Anantapur Visit: నేడు అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

  • Dhurandhar 2: ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని..రియాక్షన్ ఇదే!

  • RCB 5 Records: డివిలియర్స్ రికార్డును సమం చేసిన టిమ్ డేవిడ్.. 250 పరుగులతో 5 రికార్డులు నెలకొల్పిన ఆర్‌సిబి

  • Tirumala Hundi Issue: శ్రీవారికి చెల్లని నోట్ల పంచాయతీ

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions