Pushpa 2 : పుష్ప 2 స్టిల్స్ తో ఆప్- బీజేపీ పోస్టర్ వార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్పుడు ఎక్కడ చూసినా పుష్ప2 మానియా కనిపిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధం అవుతున్న ఢిల్లీ రాజకీయాలు కూడా ఇప్పుడు పుష్ప రాజ్ చుట్టూ తిరగడం మొదలైంది. అసలు విషయం ఏమిటంటే AAP ఇటీవల విడుదలైన పుష్ప 2 సినిమా డైలాగులపై ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. “కేజ్రీవాల్ జుకేగా నహీ” అంటూ చిత్రంలోని డైలాగ్ ఆధారంగా రూపొందించబడింది. పోస్టర్లో, కేజ్రీవాల్‌ను సినిమాలో హీరోగా చూపించారు. అతని భుజంపై ఆప్ ఎన్నికల చిహ్నం ‘చీపురు’ ఉంది. పోస్టర్లో, “త్వరలో నాలుగోసారి” అని రాసి ఉంది. గతంలో 2013, 2015 మరియు 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ యొక్క ఎన్నికల విజయాలను ఇక్కడ ప్రస్తావించారు.
Tollywood : బాలీవుడ్ పై టాలీవుడ్ హీరోల డామినేషన్
Also Read
- Kavya-Anirudh Reception: సింధూరం లేదు.. మెహందీ లేదు.. కావ్య మారన్ రిసెప్షన్ స్టైల్‌పై నెటిజన్ల చర్చ!!
- Rashmika-Mysaa: రష్మిక అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ‘మైసా’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Krithi Shetty: 'జనవరి 12 విడుదల'.. హిట్ తప్పనిసరి!
- Kavya-Anirudh Reception: సీఎం విజయ్‌తో కలిసి రాని సంగీత.. అనిరుధ్-కావ్య రిసెప్షన్లో విడివిడిగా కనిపించిన దంపతులు
దానికి పోటీగా ‘అవినీతిపరులను అంతమొందిస్తాం’ అని బోల్డ్ అక్షరాలతో రాసి ఉండగా, పుష్ప పాత్రలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా సింహాసనంపై కూర్చున్నట్లు చూపుతున్న పోస్టర్‌ను బీజేపీ ఢిల్లీ యూనిట్ సోమవారం విడుదల చేసింది. పుష్ప డైలాగ్‌ని అనుకరిస్తూ పోస్టర్‌పై రప్పా రప్పా’ అని రాసి ఉంది. AAP మరో సారి ఢిల్లీలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే 1998 నుంచి ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ నేతలు.. ఢిల్లీ రాజకీయాల్లో ఆప్ ఆధిపత్యాన్ని అంతం చేసేందుకు రానున్న అసెంబ్లీ ఎన్నికలను తమకు మంచి అవకాశంగా భావిస్తున్నారు. సోషల్ మీడియాతో సహా వివిధ మాధ్యమాల ద్వారా ఇరువర్గాలు నినాదాలు, పోస్టర్లు, మీమ్స్ అలాగే యానిమేషన్ వీడియోల ద్వారా ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుంటున్నాయి.
- Tags
తాజావార్తలు
-
IPL 2027-SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ 2027లో ఆడనున్న స్టార్ ప్లేయర్!
-
AP Panchayat Elections 2026: పంచాయతీ ఎన్నికల్లో కీలక మార్పులు.. పోలింగ్ కేంద్రాల విలీనంపై ఈసీ ఉత్తర్వులు
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
Kavya-Anirudh Reception: సింధూరం లేదు.. మెహందీ లేదు.. కావ్య మారన్ రిసెప్షన్ స్టైల్‌పై నెటిజన్ల చర్చ!!
-
HYDRAA: నగరంలో మరో చెరువు పునరుద్ధరణకు హైడ్రా ప్లాన్.. 3 ఎకరాల నుంచి 12 ఎకరాలకు విస్తరణ
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం