Site icon NTV Telugu

Karmasthalam: బిగ్ బాస్ దివి పాన్ ఇండియా ‘కర్మస్థలం’.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్!

Karmasthalam News

Karmasthalam News

బిగ్ బాస్ బ్యూటీ దివి వద్త్యా ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కర్మస్థలం’ నుంచి తాజాగా కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ ట్రేడ్ సర్కిల్స్‌లో, సినీ అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. సామ్రాద్ని ఫిల్మ్స్, రాయ్ ఫిల్మ్స్ బ్యానర్ల మీద హర్ష వర్దన్ షిండే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాకీ షెర్మాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా రూపొందుతోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో దివిని ఓ శక్తివంతమైన యోధురాలిగా చూపించడం విశేషం.

Also Read:Story Board: సమగ్రాభివృద్ధికి సమ్మిట్ తో ముందడుగు.. ప్రత్యేక ఆకర్షణగా విజన్ డాక్యుమెంట్

‘కర్మస్థలం’ పోస్టర్‌లో దివి కదనరంగంలో దూసుకుపోతున్నట్టుగా కనిపిస్తోంది. చుట్టూ అగ్ని జ్వాలలు, బ్యాక్ గ్రౌండ్‌లో యుద్ధం చేస్తున్న సైనికులు వంటి ప్రతి డీటైల్‌ను అద్భుతంగా చిత్రీకరించారు. ఇది ప్రేక్షకులలో ఉత్కంఠను రేపుతోంది. ఈ చిత్రానికి విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్ వర్క్ ప్రధాన బలాలుగా నిలుస్తాయని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. భారీ యాక్షన్, గ్రాఫిక్స్ ఉన్న సినిమాగా దీనిని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం సహా పలు భాషల్లో విడుదల కానుంది. ఇందులో బిగ్ బాస్ దివి వద్త్యా ముఖ్య పాత్రతో పాటు, ప్రముఖ నటీనటులు నటించారు. ప్రస్తుతం ‘కర్మస్థలం’ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు, విడుదల తేదీని త్వరలోనే చిత్ర బృందం ప్రకటించనుంది.

Exit mobile version