NTV Telugu Site icon

Spirit: ‘స్పిరిట్‌’లో భార్య భర్తల విలనిజం? అసలేం ప్లాన్ చేస్తున్నావ్ వంగా?

Prabhas Spirit

Prabhas Spirit

Kareena Kapoor-Saif Ali Khan Signs Sandeep Reddy Vanga’s Spirit: సందీప్ రెడ్డి వంగ.. అంటేనే ఒక సెన్సేషన్. ఇక అతనికి ఇండియన్ బాహుబలి, పాన్ ఇండియా సూపర్ స్టార్, బాక్సాఫీస్ హంటర్, వేల కోట్ల కటౌట్ ప్రభాస్ తోడైతే ఎలా ఉంటుందో.. ఊహించడం కష్టమే. పైగా ఫస్ట్ టైం ప్రభాస్‌ పోలీస్ ఆఫీసర్ రోల్ అంటున్నాడు.. అందులోను డ్యూయెల్ రోల్ అనే టాక్ ఉంది. అసలే.. సందీప్‌ వైలెన్స్‌ను నెక్స్ట్ లెవల్లో చూపిస్తానని.. గతంలోనే చెప్పేశాడు. అందుకు అనిమల్‌ సినిమాను జస్ట్ శాంపిల్ మాత్రమే అనుకోవాలి. అలాంటి సినిమా తర్వాత వస్తున్న స్పిరిట్.. ఇంకెలా ఉంటుందో అనే ఎగ్జైట్మెంట్ అందరిలోను ఉంది. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ దాదాపు పూర్తి చేసిన సందీప్.. నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో.. విలన్‌గా స్టార్ జోడీని రంగంలోకి దింపుతున్నాడనే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.

Devara -Pushpa 2: ‘దేవర’ ఆయుధ పూజ.. ‘పుష్ప 2’ జాతర.. పోతారు మొత్తం పోతారు!

బాలీవుడ్ స్టార్ కపుల్స్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్‌ను స్పిరిట్ కోసం ట్రై చేస్తున్నాడట సందీప్. స్పిరిట్‌లో ఈ ఇద్దరు భార్యాభ‌ర్త‌లుగా కనిపించడమే కాకుండా.. ఇద్దరికీ కూడా విలన్ టచ్ ఇస్తున్నట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. మరో వెర్షన్ ప్రకారం.. హీరోయిన్‌ పాత్ర కోసం కరీనా కపూర్‌ను అప్రోచ్ అయినట్టుగా చెబుతున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ది మాత్రం విలన్‌ పాత్ర అని బాలీవుడ్‌ భోగట్టా. ఇప్ప‌టికే సైఫ్ అలీఖాన్ ఆదిపురుష్‌లో విల‌న్‌గా న‌టించాడు. కానీ ఆ సినిమా పెద్దగా కలిసి రాలేదు. ఇప్పుడు దేవర సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు సైఫ్. ఇప్పుడు మరోసారి ప్రభాస్‌కు విలన్ అని అంటున్నారు. అయితే.. ఇలాంటి వార్తల్లో నిజ నిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. కానీ సందీప్ రెడ్డి మాత్రం ప్రభాస్‌తో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.

Show comments