Karate Kid: జాకీ చాన్ సినిమాకి అజయ్ దేవగన్ వాయిస్.. ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఉన్న ‘కరాటే కిడ్’ ఫ్రాంచైజ్ మరోసారి తెరపైకి రాబోతోంది. మే 30న విడుదలకానున్న ‘కరాటే కిడ్: లెజెండ్స్’ చిత్రం కోసం లెజెండరీ యాక్షన్ హీరో జాకీ చాన్ మరోసారి మిస్టర్ హాన్గా మళ్లీ కనిపించబోతున్నారు. ఆయన శిక్షణలో ఈసారి హీరోగా కనిపించేది బెన్ వాంగ్. ఈ సినిమాకు హిందీ డబ్బింగ్ కోసం అజయ్ దేవగణ్ తన గొంతు ఇస్తుండగా, అతని కుమారుడు యుగ్ దేవగణ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా తన వాయిస్ ఓవర్ డెబ్యూ చేస్తున్నాడు. ఒకే సినిమాలో తండ్రి-కొడుకు కలిసి పని చేయడం ఇదే తొలిసారి అని అంటున్నారు. తాజాగా విడుదలకు ముందు జాకీ చాన్, బెన్ వాంగ్తో కలిసి అజయ్–యుగ్ మాట్లాడారు. అజయ్ మాట్లాడుతూ , తన తండ్రి వీరు దేవగణ్ గురించీ, తనకు మిస్టర్ మియాగీలా ప్రేరణ ఇచ్చిన గురువు అని గుర్తు చేసుకున్నారు. “ఆయన కోరికే నన్ను నటుడిని చేసింది,” అన్నారు.
దానికి జాకీ స్పందిస్తూ, “నాకు ఒక్క మిస్టర్ మియాగీ కాదు, ఎందరో గురువులున్నారు. అందరికీ నేను ఈ రోజు కృతజ్ఞుడిని,” అన్నారు. యాక్షన్ ఎలా మారింది? అనే ప్రశ్నకు అజయ్ చెబుతూ – “మునుపటిలా కేబుల్స్ లేకుండా, గ్రాఫిక్స్ లేకుండా చేసే రోజుల్లో పని చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ వలన తేలికైంది. కానీ హార్డ్ వర్క్‌కి మాత్రం ఎప్పుడూ ప్రత్యామ్నాయం లేదు,” అని స్పష్టంగా చెప్పారు. జాకీ చాన్ మాత్రం ఇండియాలో కంగ్ ఫూ యోగా షూటింగ్, బాలీవుడ్ స్టైల్ డ్యాన్స్ గురించిన మధుర జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. “బాలీవుడ్ డ్యాన్స్ చూసినప్పుడల్లా ఆశ్చర్యపోతా. అంతటి టైమింగ్, గ్రేస్, రిథమ్ ఉంటాయ్. ఒకసారి మాత్రం నేను ఫుల్ డ్యాన్స్ సీక్వెన్స్ చేయాలి అనిపించింది,” అని నవ్వుతూ చెప్పారు. యాక్షన్ – డ్యాన్స్ రెండూ ఒకే కిందికి వస్తాయన్నారు జాకీ: “ఇవి రెండూ రిథమ్, ఫ్లో, ఎక్స్‌ప్రెషన్‌తో సాగుతాయి. అందుకే నేను డ్యాన్స్‌ని యాక్షన్‌గా చూస్తా.”బాలీవుడ్ – జాకీ చాన్ కలయిక? ఈ చర్చలో ఒక ఆసక్తికర సిగ్నల్ కూడా వెలువడింది – జాకీ చాన్ ఒక బాలీవుడ్ మూవీకి పూర్తిస్థాయి పాత్ర చేయాలని తన కోరిక బయటపెట్టారు.
Also Read
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
- Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
తాజావార్తలు
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!