Site icon NTV Telugu

Karan johar: రాజమౌళి సినిమాలపై కరణ్ జోహార్ వైరల్ కామెంట్స్

February 7 2025 02 17t091752.012

February 7 2025 02 17t091752.012

బాలీవుడ్  ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కరణ్ జోహార్ గురించి పరిచయం అక్కర్లేదు. కుటుంబ కథ చిత్రాలకి కరణ్ పెట్టింది పేరు. దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు కరణ్. ఇక మూవీస్ విషయంలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో బయట కూడా అంతే యాక్టివ్ గా ఉంటాడు. ఇందులో భాగంగా ఎప్పుడు ఏదో ఒక విషయం పై మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉండే కరణ్, తాజాగా ఒక సినిమా హిట్ అవ్వడం గురించి మాట్లాడుతూ.. టాలీవుడ్ లెజండరి డైరెక్టర్‌ రాజమౌళి మూవీస్‌పై వైరల్ కామెంట్స్ చేశాడు..

Also Read:Pavani Reddy: రెండో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్..

కరణ్ మాట్లాడుతూ.. ‘మనం తీసిన సినిమా పై నమ్మకం ఉంటే ప్రేక్షకులు లాజిక్ గురించి పట్టించుకోరు. ఉదాహరణకు రాజమౌళి సినిమాలు తీసుకుంటే.. ఆయన చిత్రాల్లో లాజిక్ గురించి ప్రేక్షకులు ఎప్పుడూ మాట్లాడలేదు. వారికి అతని కథ పై పూర్తి నమ్మకం ఉంటుంది. ఎలాంటి సన్నివేశాలనైనా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కించగలడని. ‘ఆర్ఆర్ఆర్’, ‘యానిమల్’, ‘గదర్’ వంటి చిత్రాలకు ఇదే వర్తిస్తుంది. ఈ సినిమాలు హిట్ అయ్యాయి అంటే ఆయా దర్శకులపై ప్రేక్షకులకు ఉన్న నమ్మకం. ‘గదర్ 2’ లో హీరో 1000 మందిని కొడుతున్నట్లు చూపించారు అది సాధ్యమా, కాదా అని ఎవరూ చూడరు. సన్నీ దేవోల్ ఏదైనా చేయగలడని దర్శకుడు అనిల్ శర్మ నమ్మారు. దాన్నే తెరపై చూపించారు. దీనే ప్రేక్షకులు కూడా నమ్మారు. ఫలితంగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అందుకే నేను చెప్పేది ఒకటే  సినిమా విజయం అనేది పూర్తిగా విశ్వాసం పై ఆధారపడి ఉంటుంది. లాజిక్ గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు సినిమా ఎంజాయ్ చేస్తూ చూడాలి’ అని కరణ్ పేర్కొన్నాడు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version