ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన నెక్స్ట్ మూవీని ప్రకటించారు. ఇందులో స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా, అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. దాదాపు ఐదేళ్ల తరువాత కరణ్ జోహార్ ఈ సినిమా కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టడానికి సిద్ధమయ్యాడు. ఈ ప్రాజెక్టులో ప్రముఖ నటులు జయ బచ్చన్, షబానా అజ్మీ, ధర్మేంద్ర కీలకపాత్రల్లో నటించనున్నారు. రణ్‌వీర్ రాకీగా, అలియా రాణి పాత్రను పోషిస్తుంది. ఇది కుటుంబ విలువల నేపథ్యంలో సాగే లవ్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. ఈ చిత్రాన్ని 2020లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా నేడు రణ్‌వీర్ పుట్టినరోజు. ఈ సందర్భంగానే ఈ కొత్త ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. మరోవైపు రణ్‌వీర్ కు సోషల్ మీడియాలో ప్రముఖులు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకంక్షాలు వెల్లువెత్తుతున్నాయి.