NTV Telugu Site icon

Bollywood : కరణ్ జోహార్, కార్తీక్ ఆర్యన్ మధ్య కుదిరిన సయోధ్య

Karhik Aryan

Karhik Aryan

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి  ఫ్రూవ్ చేసుకుంటున్న యంగ్ స్టర్ కార్తీక్ ఆర్యన్. రీసెంట్లీ భూల్ భూలయ్యా – 3తో హిట్టు అందుకున్న ఈ కుర్ర హీరో నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి ఆలోచనలో పడ్డాడు. ఇదే టైంలో తెలుగులో హిట్టుబొమ్మగా నిలిచిన నాని సరిపోదా శనివారం రీమేక్ చేయబోతున్నాడని టాక్ వచ్చింది. కానీ అవేవి నిజాలు కాలేదు.  ఎట్టకేలకు నయా ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసి  ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు.

Also Read : Bellamkonda : భైరవం ఫిబ్రవరి రిలిజ్ డేట్ లాక్..?

టిసిరీస్, పలు నిర్మాణ సంస్థలతో వర్క్ చేసినా ధర్మ ప్రొడక్షన్‌లో వర్క్ చేయాలన్నది అతడి డ్రీమ్. టూ టైమ్స్ ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఫస్ట్ టైం దోస్తానా 2 కోసం సైన్ చేస్తే నిర్మాణ సంస్థ యజమాని కరణ్ జోహార్, కార్తీక్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల మూవీ ఆగిపోయింది. ఆ తర్వాత ఓ వార్ మూవీ చేయాలనుకుంటే అది పట్టాలెక్కలేదు.
ఇక ఇంతే ధర్మ ప్రొడక్షన్‌లో సినిమా సెట్ అవ్వదు అనుకుంటోన్న టైంలో వచ్చిందే తు మేరీ మే తేరా, మే తేరా తు మేరీ. కరణ్- కార్తీక్ మధ్య సయోధ్య కుదరడంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. రీసెంట్లీ మూవీ ఎనౌన్స్ చేసింది యూనిట్. లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ నెక్ట్స్ ఇయర్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. 2026లో మూవీ రిలీజ్ కాబోతుంది. తన డ్రీమ్ కంపెనీతో ధర్డ్ టైం సెట్ అయినందుకు కార్తీక్ ఆర్యన్‌తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. అయితే సినిమాకు కొబ్బరికాయ కొట్టేంత వరకు చెప్పలేని సిచ్చుయేషన్ ఉంటోన్న నేపథ్యంలో టెన్షన్ పడుతున్నారు.

Show comments