Kantamaneni Ravi Shankar: పంచభూతాలపై టాలీవుడ్ లో కొత్త సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kantamaneni Ravi Shankar:గతేడాది సామాజికాంశాల నేపథ్యంలో వచ్చిన ‘రాజధాని ఫైల్స్’తో టాలీవుడ్ ప్రొడక్షన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ‘తెలుగువన్’ సంస్థ .. ఇప్పుడు తమ రెండో ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్ ఈ చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టబోతున్నారు. నిన్న (మే 19) ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తొలి చిత్రంతోనే ఆలోచింపజేసే కథను అందించిన రవిశంకర్, ఈసారి అంతకంటే భిన్నమైన, భారీ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు. ప్రకృతిలోని ‘పంచభూతాల’ను ప్రధాన కథాంశంగా తీసుకుని, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఒక విజువల్ వండర్‌గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేశారు.
ఈ భారీ ప్రాజెక్టుకు టాలీవుడ్ ప్రముఖ రచయిత, దర్శకుడు జనార్ధన మహర్షి కథ-మాటలు అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని హంగులతో, పక్కా ప్లానింగ్‌తో రూపొందించి 2027 సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.
Also Read
- S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
- S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
- S Janaki: "ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు.." ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్!
- S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!