Site icon NTV Telugu

Mohan Babu: ఈ “కన్నప్ప” సినిమాలో అందరూ హీరోలే

Mohan Bab

Mohan Bab

కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో మోహన్ బాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా చేయడం కేవలం భగవంతుని ఆశీస్సుల వల్లనే మన చేతుల్లో ఏమీ లేదు అనేది ఈ సినిమా ఒక నిదర్శనం. మన జీవితంలో ప్రతి కదలిక ఆ భగవంతుడి నిర్ణయం.. రెండు సినిమాలు హిట్ అయిన వెంటనే మనం గ్రేట్ అనుకుంటాం కానీ మనం గ్రేట్ కాదు మనం కేవలం ఇన్స్ట్రుమెంటల్. ఆ భగవంతుడి ఆశీస్సులు మన తల్లిదండ్రుల ఆశీస్సులే మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఈ సినిమా ఎలా తీశామో అందరూ చెప్పేసారు కాబట్టి నేను చెప్పక్కర్లేదు. ఒక మంచి సినిమా చేసాం భగవంతుడి ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు నా బిడ్డ విష్ణు కి ఉండాలి అని కోరుకుంటున్నాను.

Also Read:Kannappa : కన్నప్పలో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడొస్తుందో తెలుసా..?

ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు? అది చేసాడు ఇది చేసాడు అనేది ఇప్పుడు వద్దు. మన బాధ్యత ఆ పరమేశ్వరుని ఆశీస్సులు సినిమా తీయగలిగాము, అందరూ హీరోలే ఈ సినిమాలో. శరత్ కుమార్, డైరెక్టర్ ముఖేష్ సహా ఈ వేదిక మీద ఉన్న నటీనటులు అందరూ హీరోలే. అందరూ హీరోల పాత్రలు వేసిన వారే, అందరూ విజయాలు సాధించిన వారే. ఒక మోహన్ లాల్ ఒక శరత్ కుమార్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నటుడికి నేను రుణపడి ఉన్నాను. వాళ్ళ అందించినటువంటి సహాయ సహకారాలు పది రోజులు షూటింగ్ అంటే 20 రోజులు న్యూజిలాండ్ లో ఉన్నారు.

Also Read:Ghaati : ‘ఘాటీ’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..

ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఒక పది పేజీలు రాయచ్చు. సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క నటీనటుడు అందరికీ హృదయపూర్వకమైన ఆశీస్సులు అందజేస్తున్నాను. ముఖేష్ సింగ్ మహాభారతం తీశాడు నేను దాదాపు 10 15 సార్లు టీవీ సీరియల్ చూశాను వండర్ఫుల్ డైరెక్టర్. ఇక ఈ వేడుకకు గిరిజన ప్రముఖులను కొందరిని పిలిచాను ఎందుకంటే తిన్నడు బోయ కులానికి చెందిన వ్యక్తి ఒక ఆదివాసి వ్యక్తి అతను కన్నప్పగా ఎలా మారాడు అనేది ఈ ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాము అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు.

Exit mobile version