విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. శుక్రవారం నాడు రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్ వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ మేరకు శనివారం నాడు సినిమా యూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించింది.
Also Read:Ram Charan-Nani : 2026 సమ్మర్ బాక్సాఫీస్ క్లాష్ ఫిక్స్..!
ఈ క్రమంలో మైత్రి శశి మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’కి అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. మారుమూల గ్రామాల్లో ఎక్కువగా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ‘సలార్’, ‘పుష్ప’ లాంటి చిత్రాల తరువాత ‘కన్నప్ప’కి కల్వకుర్తి వంటి ఊర్లో థియేటర్లు నిండుతున్నాయి. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ ఇలా అన్ని చోట్లా ప్రభంజనం సృష్టిస్తోంది. ‘కన్నప్ప’ చిత్రం మున్ముందు భారీ విజయాన్ని నమోదు చేయనుంది. క్లైమాక్స్ చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి. విష్ణు గారు అద్భుతంగా నటించారు. ఇప్పుడున్న తరం చూడాల్సిన చిత్రమిది. ఇలాంటి సినిమాను తీసుకు వచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణు గారికి ధన్యవాదాలు’ అని అన్నారు.
