టాలీవుడ్ నుంచి తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీస్‌లో ‘కన్నప్ప’ ఒకటి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా జూన్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచారు మేకర్స్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రచారాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ‘కన్నప్ప’ టీమ్ బెంగళూరు వెళ్లింది. ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌తో కలిసి మంచు మోహన్ బాబు, విష్ణు ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ..
Also Read : Kangana Ranaut : వయస్సు గురించి నాకు పట్టింపు లేదు..
‘ ‘కన్నప్ప’ మూవీలో శివుని పాత్ర కోసం ముందుగా నన్ను అడిగారు. కానీ నా డేట్స్ కుదరకపోవడంతో నటించలేకపోయినా. ఈ సారి విష్ణు ఏం అడిగినా చేస్తాను. రెమ్యునరేషన్ నాకు సమస్యే కాదు’ అని తెలిపారు. ఇంతలోనే మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘ఏదైనా కన్నడ సినిమాలో నమస్తే బాగుండు అని ఎప్పుడు అనిపిస్తూ ఉండేది. అప్పట్లో అంబరీష్ను అడిగితే, నవ్వి ఊరుకునే వాడు. రాజ్ కుమార్ గారికి అడగాలంటే ధైర్యం సరిపోలేదు.. అందుకని ఆయన తనయుడు శివరాజ్ కుమార్‌న్ని ఒక కోరిక కోరుతున్నాను. ఆయన నటించే చిత్రంలో విలన్ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను’ అని అన్నారు. దీంతో రాజ్ కుమార్ స్పందిస్తూ.. ‘మోహన్ బాబు గొప్ప నటుడు. ఆయన నా చిత్రంలో విలన్‌గా నటిస్తానని అడిగారు కానీ.. నేను ఆ పాత్ర ఇవ్వను. ఎందుకంటే నేను ఆయనతో ఫైట్ చేయాలనుకోవడం లేదు. ఒక అందమైన అన్నయ్య పాత్ర ఇస్తా. హై క్వాలిటీ రోల్ అది’ అని నవ్వుతూ బదులిచ్చాడు.
