NTV Telugu Site icon

Kannappa : ప్రభాస్ ఫోటో లీక్ చేసిన వారిని పట్టుకుంటే 5 లక్షలు : మంచు విష్ణు

Manchu

Manchu

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా నుండి రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై నిర్మాత, హీరో మంచు విష్ణు లెటర్ రిలీజ్ చేసారు. అందులో ” కన్నప్ప టీమ్ నుంచి అత్యవసర, హృదయపూర్వక విజ్ఞప్తి.. ప్రియమైన ప్రభాస్ అభిమానులు మరియు అందరి కథానాయకుల అభిమానులను కోరుతున్నది ఏమనగా  కన్నప్ప కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా మేము మా హృదయాలను, ప్రాణాలను అర్పించాము. రెండు సంవత్సరాల నిబద్దతతో ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి మా టీమ్ నిరంతరం కృషి చేస్తోంది. ఇలాంటి క్షణంలో కన్నప్ప సినిమా నుంచి ఒక వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇమేజ్ అనధికారంగా లీక్ అయినందుకు చాలా బాధ పడుతున్నాము, చింతిస్తున్నాము.

Also Read : Rebal Star : మంచు విష్ణు కన్నప్ప సినిమాలోని ప్రభాస్ ఫోటో లీక్

ఈ లీక్ మా కష్టాన్ని మాత్రమే కాకుండా, ఈ ప్రాజెక్ట్ప నిరంతరం కృషి చేస్తున్న 2,000 మందికి పైగా VFX కళాకారుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ లీక్ ఎలా జరిగింది అనేది కనుగొనేందుకు మేము పోలీస్ కేసు పెట్టడం జరుగుతోంది. ఈ లీక్ అయిన ఇమేజ్ ఫుటేజ్ ను ఎవరైనా షేర్ చేస్తూ ఉంటే, ఆ దొంగల్ని పట్టుకోమని అభిమానులందర్నీ మనస్ఫూర్తిగా కోరుతున్నాము. దీనిని షేర్ చేయడం ద్వారా, చట్టపరమైన చర్యలకు గురి కావాల్సి ఉంటుంది. ఈ లీక్ చేసిన వారిని ఎవరైనా కనుగొంటే, వారికి 5,00,000 రూపాయలు బహుమానంగా ఇస్తున్నాం. ఈ విషయం తెలుసుకున్న వెంటనే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ట్విట్టర్ అకౌంట్కు డైరెక్ట్గా మెసేజ్ పంపండి అని ప్రార్ధిస్తున్నాము. ప్రేమ మరియు నిబద్ధతతో పుట్టిన ఈ ప్రాజెక్ట్ INTEGRITYని కాపాడటానికి మీ సహాయాన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఈ సినిమా స్ఫూర్తిని కాపాడటంలో మాతో చేతులు కలపండి”  అని పేర్కొన్నారు.

Show comments