NTV Telugu Site icon

Allu Arjun: అల్లు అర్జున్ నివాసానికి కన్నడ సూపర్ స్టార్

Upendra Visits Allu Arjun home

Upendra Visits Allu Arjun home

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టయి ఒకరోజు రాత్రి జైలులో గడిపి బయటకు వచ్చారు అల్లు అర్జున్. ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో ఆయన జైలు నుంచి విడుదలై ముందు గీత ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్లారు. అక్కడి నుంచి ఆయన నివాసానికి వెళ్లారు. ఇక అల్లు అర్జున్ నివాసానికి వచ్చిన విషయం తెలుసుకుని సినీ ప్రముఖులందరూ ఆయన నివాసానికి క్యూ కట్టారు దర్శకులు, నిర్మాతలు, హీరోలు. ఇలా అందరూ ఆయన నివాసానికి వెళ్తున్నారు. అయితే కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కూడా అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. గతంలో వీరిద్దరూ కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో సన్నాఫ్ సత్యమూర్తి అనే సినిమా చేశారు.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై వర్మ సంచలనం..దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?

తన యూఐ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన ఉపేంద్ర అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం గురించి తెలిసి వెంటనే అల్లు అర్జున్ నివాసానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. మరోపక్క మీడియా సమావేశం నిర్వహించారు. అల్లు అర్జున్ ఈ మీడియా సమావేశంలో నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నేను బాధిత కుటుంబానికి క్షమాపణ చెబుతున్నా, ఒకరు చనిపోవడం దురదృష్టకరమైన ఘటన.. నేను ఆ కుటుంబానిఇక అన్ని విధాలా అండగా ఉంటా అని చెప్పుకొచ్చారు. సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన ఘటన మా కంట్రోల్‌లో లేదు, 20 ఏళ్లుగా నేను సంధ్య థియేటర్ లో సినిమా చూస్తున్నాను, అది అనుకోకుండా జరిగింది కాబట్టి రేవతి కుమారుడు శ్రీ తేజని పరామర్శిస్తాను అని అల్లు అర్జున్ అన్నారు.

Show comments