Shiva Rajkumar: విజయ్ ఏదైనా అడుగు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.. నటుడు శివరాజ్ సంచలన వ్యాఖ్యలు!
- టీవీకే చీఫ్ విజయ్ పై కన్నడ నటుడు శివరాజ్ సంచలన వ్యాఖ్యలు..
- తమిళగ వెట్రీ కజగం అధినేత విజయ్ రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నాను..
- విజయ్ ఏదైనా అడుగు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి: నటుడు శివరాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiva Rajkumar: తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని కన్నడ నటుడు శివరాజ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా యాక్టర్ శివరాజ్ విలేకరులతో మాట్లాడుతూ.. తన స్నేహితుడు అయిన విజయ్ రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నాను అన్నారు. కానీ, కరూర్ తొక్కిసలాట వివాదం లాంటివి మరోసారి జరగకుండా వేసే ప్రతి అడుగును జాగ్రత్తగా ఆలోచించి వేయాలని సూచించారు. అయితే, కరూర్ తొక్కిసలాట ఎలా జరిగిందో తనకు తెలియదు.. కాబట్టి, విజయ్ మరింత జాగ్రత్తగా తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Read Also: Astrology: అక్టోబర్ 09, గురువారం దినఫలాలు.. ఏ రాశి వారు గుడ్‌న్యూస్ వింటారంటే..?
Also Read
ఇక, కరూర్ తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదం రాజకీయ ఉద్రిక్తతకు దారి తీసింది. ర్యాలీలో ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు విజయ్ పార్టీ తమిళగ వెట్రీ కజగం (టీవీకే) ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. టీవీకే ఈ ఆరోపణలను ఖండించి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణకు ఆదేశించాలని కోరింది. ర్యాలీకి 10,000 మంది హాజరుకు అనుమతి తీసుకున్నప్పటికీ, దాదాపు 30,000 మంది ప్రజలు వేదిక దగ్గరకు వచ్చారని పోలీసులు వెల్లడించారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు చొప్పున పరిహారం అందించనున్నట్లు విజయ్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Rohit Sharma: హిట్‌మ్యాన్ హిస్టరీ.. సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. చరిత్రలో ఒకే ఒక్కడిగా..
-
APL 2026: మంగళగిరిలో ఏపీఎల్ జోష్.. సెమీస్, ఫైనల్‌కు భారీ ఏర్పాట్లు
-
Israel-Lebanon: శాంతి ఒప్పందానికి తూట్లు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
-
Ex-Terrorist: ఉగ్రవాదుల జేబుల్లో కండోమ్, ప్రేమ లేఖలు..ధురంధర్లో చూపించి నిజమే: మాజీ ఉగ్రవాది..
-
Sajjala Ramakrishna Reddy: గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం.. వైసీపీ కొత్త వ్యూహం
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!