NTV Telugu Site icon

Kanguva : కంగువ నైజాం థియేటర్స్ పంచాయితీ ఏంటంటే..?

Kanguva

Kanguva

తమిళ స్టార్‌ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్‌ యాక్షన్‌ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్‌ నటుడు బాబీ డియోల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నవంబరు 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది.

Also Read : Laapataa Ladies: ఆస్కార్‌ రేస్ లో పేరు మారిన ‘లాపతా లేడీస్‌’

కంగువ రిలీజ్ కు కేవలం ఒక్క రోజు మాత్రమే రిలీజ్ ఉంది. కానీ ఇప్పటికి తాజాగా తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ అరకొరగా మాత్రమే రిలీజ్ చేసారు. ముఖ్యంగా నైజాం వంటి ఏరియాస్ లో లిమిటెడ్ స్క్రీన్స్ ను మాత్రమే ఓపెన్ చేసారు. కారణాలు ఏంటని ఆరా తీయగా కంగువ తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంస్థకు నైజాం లో థియేటర్ చైన్ కలిగిన సంస్థకు మధ్య తకరారు నడుస్తోందట. అటు PVR , AMB,AAA వంటి వాటిలో కూడా ఇప్పటికీ బుకింగ్స్ ఓఎన్ చేయలేదు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ భాగస్వామ్యంతో జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ పై నిర్మించిన కంగువ విడుదలలో ఎదో ఒక జాప్యం జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది.  మరికొన్ని గంటల్లో ఓవర్సీస్ ప్రీమియర్స్ స్టార్ట్ అవుతుండగా నైజాం పంచాయతీ ఎప్పుడు సెట్ అవుతుందో ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేస్తారోనని సూర్య ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Show comments