NTV Telugu Site icon

Kanguva : 12 నిమిషాల సీన్స్ ట్రిమ్ చేసిన కంగువ మేకర్స్

Kanguva

Kanguva

స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ తెరకెక్కించాడు . ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు.  నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

Also Read : Mahesh Babu : నయనతార వివాదం.. ఆసక్తి రేపుతున్న మహేష్ ఇన్‌స్టా పోస్ట్

కాగా ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతున్నఈ సినిమా పట్ల అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సౌండింగ్, మరీ ఓవర్ బాగ్రౌండ్ మ్యూజిక్ ఇబ్బందిపెట్టిందని ఫీడ్ బ్యాక్ వచ్చింది. అలాగే రన్ టైమ్. సూర్య రెండు పాత్రల్లో వచ్చిన ఈ సినిమా నిడివి  ఎక్కువ ఉందని  దింతో ఈ అంత రన్ టైమ్ అవసరం లేదని టాక్ గట్టిగా వినిపించింది. కాస్తా ఆలస్యంగా మేల్కొన్న మేకర్స్ ఈ సినిమాలోని 12 నిమిషాల సీన్స్ ను ట్రిమ్ చేసారు. నేటి నుండి ఆ ఎడిట్ చేసిన కొత్త వర్షన్ థియేటర్స్ లో ప్రదర్శితం కానుంది. అటు మ్యూజిక్ కు సంబంధించి రెండు పాయింట్స్ తగ్గించి [పెట్టాలని థియేటర్ యాజమాన్యాలను సూచించారు మేకర్స్. ఇక రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తుందని అనుకున్న ఈ ఈసినిమా ప్రస్తుతం రూ 150 కోట్లకు అటు ఇటు గా ఊగిసలాడుతోంది. ట్రిమ్ వర్షన్ తో అయిన ఈ సినిమా కలెక్షన్స్ లో ఏమైనా జంప్ ఉంటుందేమో చూడాలి.

Show comments