NTV Telugu Site icon

kanguva : ‘పుష్ప’రాజ్ ను ఫాలో అవుతున్న కంగువ..

Suriya

Suriya

ఇటీవల సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడమే కాదు ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలో నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – 2 కు సంబంధించి హైదరాబాద్ లో భారీ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ పుష్ప డిస్ట్రిబ్యూటర్లను హైదరాబాద్ రప్పించారు మేకర్స్. వీరితో పాటుగా అన్నిఅన్ని భాషల మీడియాను భాగ్యనగరం రప్పించి పుష్ప రిలీజ్ డేట్ ప్రకటించారు.

Also Read : UnstoppableWithNBK : ‘సీమ సింహం’ తో సింగం ముచ్చట్లు

కాగా ఇప్పడు సూర్య నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కంగువ కూడా ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు . ముందుగా ఈనెల 7వ తేదీన యూనిట్ హైదారాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత రెండు రోజుల గ్యాప్ తో ఈ నెల 9వ తారీఖున ముంబైలో భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు తమిళ్, తెలుగు సహా అన్ని భాషల మీడియాను ముంబై తీసుకు వెళ్తున్నారు స్టూడియో గ్రీన్ నిర్మాతలు. ముంబై మీడియాతో కలిసి ఈవెంట్ ను భారీగా నిర్వహించబోతున్నారు. ఈ మధ్య పాన్ ఇండియా ప్రమోషన్స్ అనేవి భారీ సినిమాలకు మొదటి రోజు కలెక్షన్స్ కు కాస్త కలిసొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా సినిమాలు అన్ని ఫ్యాన్ ఇండియా ప్రమోషన్స్ కె మొగ్గు చూపుతున్నాయి.మరోవైపు కంగువ ముంబై ఈవెంట్ రోజు రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్ లాంఛ్ ను లక్నోలో నిర్వహించబోతున్నారు. ఇక నుండి రాబోయే భారీ బడ్జెట్ సినిమాలను ఇలా పాన్ ఇండియా స్థాయిలో నిర్వహించాల్సిందే

Show comments