Site icon NTV Telugu

Raghava Lawrence : భారీ ధర పలికిన కాంచన 4 రైట్స్

Kanchana 4

Kanchana 4

హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి ఇటు హీరోగా అటు దర్శకుడిగా పాపులరయ్యాడు రాఘవ లారెన్స్. మునితో మొదలైన కాంచన ఫ్రాంచైజీ నుండి ఇప్పటి వరకు మూడు పార్ట్స్ రాగా, ఇప్పుడు ఫోర్త్ ఇన్ స్టాల్ మెంట్ మూవీని ప్రిపేర్ చేస్తున్నాడు. రీసెంట్లీ కాంచన 4 సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో  ఫీమేల్ లీడ్ గా పూజా హెగ్డేతో పాటు బాలీవుడ్ ఐటం బాంబ్ నోరా ఫతేహీ మరో కీ రోల్ ప్లే చేస్తోంది. కాంచన మునుపటి సిరీస్ ల కంటే కాంచన 4ను అత్యంత భారీగా దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు లారెన్స్.

Also Read : RT76 : భర్త మహాశయులకు విజ్ఞప్తి.. సంసార సాగరంలో స్టార్ హీరోకు కష్టాలు…

కాగా ఇప్పడు ఈ సినిమా సాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ భారీ ధర పలికాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ రూ. 60 కోట్లకు అమ్మడుపోగా సాటిలైట్ రైట్స్ రూ. 50 కోట్లు పలికాయట. ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ కొనుగోలు చేసినట్టు చెన్నై వర్గాల టాక్. ఈ లెక్కన చూస్తే సినిమా బడ్జెట్ మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో తిరిగొచినట్టే. లారెన్స్ సినిమా ఈ ధర అంటే మేకర్స్ కు జాక్ పాట్ అనే చెప్పాలి. పాన్ ఇండియన్ సినిమాగా వస్తున్న కాంచనా 4ను థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాతఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా డీల్ క్లోజ్ చేశారట. హిందీలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ సిరీస్ లో భాగంగా వస్తున్న కాంచన 4 ఏ రేంజ్ లో బయపెడుతుందో చూడాలి.

Exit mobile version