Site icon NTV Telugu

Thug Life: కమల్, శింబు షూటింగ్ స్టిల్ వైరల్.. షూటింగ్ స్పాట్ ఎక్కండంటే..?

Whatsapp Image 2024 05 06 At 12.06.59 Pm

Whatsapp Image 2024 05 06 At 12.06.59 Pm

లోకనాయకుడు కమల్ హాసన్ “విక్రమ్”సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.అప్పటివరకు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న కమలహాసన్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.సక్సెస్ అందుకున్న ఊపులో కమల్ హాసన్ శంకర్ డైరెక్షన్ లో ఇండియన్ 2 ,ఇండియన్ 3 సినిమాలలో నటించాడు .ప్రస్తుతం ఆ సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం కమల్ హాసన్ వరుస సినిమాలతో బిజీ గా వున్నారు.కమల్ హాసన్ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘థగ్‌ లైఫ్‌’.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్నారు.థగ్‌ లైఫ్ చిత్రాన్ని కమల్ హాసన్‌-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్‌, రెడ్ జియాంట్ మూవీస్‌ మరియు మద్రాస్ టాకీస్‌ బ్యానర్లపై కమల్‌ హాసన్‌,ఆర్ మహేంద్రన్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.కమలహాసన్ 234 వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో ఐశ్వర్యలక్ష్మి, త్రిష, హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో శింబు, గౌతమ్‌ కార్తీక్‌, జోజు జార్జ్‌, దుల్కర్ సల్మాన్‌ మరియు జయం రవి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా థగ్‌లైఫ్ షూటింగ్ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది.ప్రస్తుతం థగ్‌ లైఫ్ షూటింగ్‌ ఢిల్లీలోని సంకట్‌ మోచన్‌ హనుమాన్‌ మందిర్‌లో కొనసాగుతోంది. కమల్ హాసన్,శింబు కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలను ఈ షెడ్యూల్‌ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ స్టిల్ లో కమల్ హాసన్‌ కోరమీసంతో కనిపిస్తున్నారు. శింబు బ్లాక్ గాగుల్స్‌ పెట్టుకొని స్టన్నింగ్‌ లుక్‌తో కనిపించాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్ మ్యూజిక్‌ అందిస్తున్నారు.

https://twitter.com/Chrissuccess/status/1787310255333867633

Exit mobile version