Thug Life: కమల్, శింబు షూటింగ్ స్టిల్ వైరల్.. షూటింగ్ స్పాట్ ఎక్కండంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోకనాయకుడు కమల్ హాసన్ “విక్రమ్”సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.అప్పటివరకు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న కమలహాసన్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.సక్సెస్ అందుకున్న ఊపులో కమల్ హాసన్ శంకర్ డైరెక్షన్ లో ఇండియన్ 2 ,ఇండియన్ 3 సినిమాలలో నటించాడు .ప్రస్తుతం ఆ సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం కమల్ హాసన్ వరుస సినిమాలతో బిజీ గా వున్నారు.కమల్ హాసన్ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘థగ్ లైఫ్’.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్నారు.థగ్ లైఫ్ చిత్రాన్ని కమల్ హాసన్-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్ మరియు మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్,ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.కమలహాసన్ 234 వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో ఐశ్వర్యలక్ష్మి, త్రిష, హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో శింబు, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్ మరియు జయం రవి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా థగ్‌లైఫ్ షూటింగ్ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది.ప్రస్తుతం థగ్ లైఫ్ షూటింగ్ ఢిల్లీలోని సంకట్ మోచన్ హనుమాన్ మందిర్‌లో కొనసాగుతోంది. కమల్ హాసన్,శింబు కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలను ఈ షెడ్యూల్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ స్టిల్ లో కమల్ హాసన్ కోరమీసంతో కనిపిస్తున్నారు. శింబు బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని స్టన్నింగ్ లుక్‌తో కనిపించాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read
- Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. 'నా శ్రీమతి' అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
https://twitter.com/Chrissuccess/status/1787310255333867633
తాజావార్తలు
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!