NTV Telugu Site icon

ముసలి హీరోలతో వద్దు … కేఆర్కే వివాదాస్పద కామెంట్స్

Kamal Khan congratulates Disha Patani on her birthday

బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ మరోసారి వివాదాస్పద ట్వీట్ తో వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి మాత్రం ఆయన కామెంట్స్ చేయడానికి దిశా పటాని బర్త్ డే సందర్భం అయింది. ఈ రోజు దిశా పటాని పుట్టినరోజు. ఈ సందర్భంగా కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ వేదికగా దిశా పటానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. “డియర్ దిశాపటాని నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ముసలి హీరోల పక్కన చాలా భయంకరంగా కనిపిస్తున్నావు. కాబట్టి దయచేసి నువ్వు టైగర్ తో మాత్రమే వర్క్ చెయ్” అంటూ ట్వీట్ చేసాడు. అయితే ఈ ట్వీట్ ఇన్ డైరెక్ట్ గా సల్మాన్ ని అవమానించడానికేనని నెటిజన్లు అంటున్నారు. దీంతో సల్మాన్ ఖాన్ అభిమానులు కెఆర్కెపై మండిపడుతున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన “రాధే”లో దిశా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పై కెసిఆర్ కి ఇచ్చిన రివ్యూ వివాదాస్పదమైంది. సినిమా బాగాలేదని చెప్పటంతో పాటూ కండల వీరుడ్ని ‘కరప్ట్’ అంటూ ఆరోపించాడు. అవినీతిపరుడు అని కూడా ఊరుకోలేదు. సల్మాన్ ‘బీయింగ్ హ్యూమన్’ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. మొత్తంగా తన వ్యక్తిగత దూషణలతో ‘దబంగ్’ ఖాన్ కి కమాల్ ఆర్ ఖాన్ చిర్రెత్తించాడు. ఆ తర్వాత సల్మాన్ కమాల్ ఆర్ ఖాన్ పై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కెఆర్కె సల్మాన్ పై కామెంట్ చేయడం మానలేదు.

Show comments