కోలీవుడ్ లో బిగ్ బడ్జెట్ తో, భారీ తారాగణంతో రూపొందుతున్న మూవీ “విక్రమ్”. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మనాగరమ్, కైతి, మాస్టర్ తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న నాల్గవ చిత్రం “విక్రమ్”.
Read Also : డియర్ మేఘ : “ఆమని ఉంటే” లిరికల్ వీడియో సాంగ్
సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్, ఎడిటర్ ఫిలోమిన్ రాజ్, స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బరివ్ (అన్బు మరియు అరివు) ఈ చిత్రానికి టెక్నిషియన్లుగా పని చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చనున్నారు. ఈ రోజు “విక్రమ్” షూటింగ్ ను ప్రారంభించారు టీం. చెన్నైలో స్టార్ట్ అయిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ షూటింగ్ లో కమల్ హాసన్, విజయ్ సేతుపతి పాల్గొంటున్నారు. ఫహద్ ఫాసిల్ త్వరలో టీంతో చేరనున్నారు. కాగా జూలై 10న రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ మూవీ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.
