డియర్ మేఘ : “ఆమని ఉంటే” లిరికల్ వీడియో సాంగ్

అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ హీరోహీరోన్లుగా నటించిన బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ “డియర్ మేఘ”. తాజాగా ఈ చిత్రం నుంచి “ఆమని ఉంటే” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ లో హీరో హీరోయిన్ పై తన ప్రేమను ఫీల్ అవుతున్నాడు. రొమాంటిక్ ఫీల్ గుడ్ సాంగ్ “ఆమని ఉంటే” సాంగ్ ను ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. కృష్ణ కాంత లిరిక్స్ అందించగా గౌర హరి సంగీతం అందించారు. సిల్లీ మాంక్స్ మ్యూజిక్ ఈ సినిమా ఆడియో రైట్స్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Read Also : ‘మా’ కాంట్రవర్సీ : బాలయ్య కామెంట్స్ పై నాగబాబు స్పందన

కాగా ఈ చిత్రంలో అర్జున్ సోమయాజులు మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఎ సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని నిర్మాత అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకుంది. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రూపొందిం రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. యూత్ ను ఆకట్టుకుంటున్న “ఆమని ఉంటే” లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-