Site icon NTV Telugu

Kamal: నాకన్నా నలుగురు బెస్ట్ యాక్టర్స్ దొరికినపుడు నటన ఆపేస్తా!

Kamal

Kamal

సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన కమల్ హాసన్ మరోసారి వార్తల్లో నిలిచారు. త్వరలో విడుదల కానున్న తన కొత్త చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటూనే, ఇటీవలి వివాదాలతో కాపురం చేస్తున్నారు. అయితే, ఆయన తాజాగా చేసిన ఒక ప్రకటన సినీ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. నెక్స్ట్ జనరేషన్ నటుల్లో తన కంటే ఉన్నతంగా నటించే నలుగురు కనిపిస్తే, నటనకు విరామం ఇస్తానని కమల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కమల్ హాసన్ నటిస్తున్న ‘థగ్ లైఫ్’ చిత్రం జూన్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కమల్ హాసన్‌కు 234వ చిత్రంగా నిలవనుంది, మరియు 1987లో విడుదలైన వీరి సంయుక్త బ్లాక్‌బస్టర్ ‘నాయకన్’ తర్వాత దాదాపు 38 ఏళ్ల గ్యాప్‌తో మణిరత్నంతో కమల్ తిరిగి కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ రంగరాయ సక్తివేల్ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. సిలంబరసన్ టీఆర్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, నాజర్, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటిస్తోంది. ‘థగ్ లైఫ్’ ప్రమోషన్స్ ఇప్పటికే ఊపందుకున్నాయి.

కమల్ హాసన్ ఇటీవల చేసిన ఒక ప్రకటన సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. “నెక్స్ట్ జనరేషన్ నటుల్లో నా కంటే ఉన్నతంగా నటించే నలుగురు కనిపిస్తే, నేను నటనను వదిలేస్తాను” అని ఆయన అన్నారు. కమల్ ఈ వ్యాఖ్యల ద్వారా యువ నటులను సవాలు విసరాలని, అదే సమయంలో తన నటనా నైపుణ్యంపై ఉన్న ఆత్మవిశ్వాసాన్ని చాటాలని ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. అయితే, కొందరు ఈ వ్యాఖ్యలను కమల్ తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా చేసిన వ్యూహంగా భావిస్తున్నారు.

Exit mobile version