NTV Telugu Site icon

Kalyani Priyadarshani : సీరియల్ నటుడితో పెళ్లి.. ఫ్యాన్స్‏కు షాకిచ్చిన భామ..?

Kalyani Priyadarshi

Kalyani Priyadarshi

 

స్టార్ దర్శకుడు ప్రియదర్శన్ కూతురుగా వెండితెరకు పరిచయమయింది కళ్యాణి ప్రియదర్శన్. తెలుగులో తోలి సినిమాగా అక్కినేని అఖిల్ ‘హలో’ సినిమాలో నటించింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించినంతగా ఆడలేదు. ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజతో చిత్రలహరి అనే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక శర్వానంద్ తో చేసిన రణరంగం ప్లాప్ తర్వాత అమ్మడు పూర్తిగా తెలుగు సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం తమిళ, మలయాళంలో వరుస హిట్ల్స్ తో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది కళ్యాణి ప్రియదర్శన్.

Also Read : Rebal Star : ‘స్పిరిట్’ లో ప్రభాస్ క్యారక్టర్ ఏంటో చెప్పేసిన సందీప్ రెడ్డి వంగా

సినిమాల సంగతి అటుంచితే ఈ అమ్మడు షేర్ చేసిన వీడియో ఇప్పుడు అభిమానులకు షాకిచ్చింది. కస్తూరిమాన్ సీరియల్ ద్వారా తమిళ బుల్లితెర ప్రేక్షకుల ప్రశంసంలు అందుకున్న శ్రీరామ్ ను కళ్యాణి ప్రియదర్శన్ పెళ్లి బట్టలతో దర్శనమిస్తూ వీడియో షేర్ చేసింది. శ్రీరామ్ ఆ పెళ్లి వీడియోను షేర్ చేస్తూ ‘అవును. ఈ క్షణాలు మమ్మల్ని సంతోషపరుస్తాయి’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. దాంతో ఆ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. కళ్యాణితో పెళ్లి వీడియో వైరల్ కావడంతో అసలు విషయం చెప్పాడు శ్రీరామ్. తాము ఇద్దరం కలిసి యస్ భారత్ వెడ్డింగ్ కలెక్షన్స్ కు ఓ అడ్వర్టైజ్‌మెంట్‌ కోసమే అలా వధూవరులుగా నటించమని అంటే తప్ప వేరే ఏమి లేదని వివరణ ఇచ్చాడు. మలయాళ నటుడుమోహన లాల్ తనయుడు ప్రణవ్, కళ్యాణి ప్రియదర్శన్ నటించిన హృదయం ఈ భామ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Show comments