Kalyan Ram: ఇలాంటి సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదన్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టର్ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలైన ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సక్సెస్ ప్రెస్ మీట్‌లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, “సినిమా చూసిన ప్రేక్షకులకు, మా నందమూరి అభిమానులకు, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇది ఎక్స్‌ట్రార్డినరీ ఫీలింగ్. అమ్మ (విజయశాంతి)తో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ గారు కీలకమైన పాత్ర వేశారు.
HIT 3 : హిట్-3.. నాని దేశ వ్యాప్త ప్రమోషన్లు..
Also Read
ఆ పాత్రకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రతి క్రాఫ్ట్ గురించి ఆడియన్స్ పొగుడుతున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సునీల్, అశోక్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అజనీస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి జీవం పోసింది. క్లైమాక్స్ అద్భుతమైన సీక్వెన్స్. పొద్దున్నే మా అబ్బాయి సినిమా చూసి, ఇలాంటి సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదని చెప్పాడు. ఆ రియాక్షన్‌కి నేను షాక్‌కి గురయ్యాను. ‘చాలా గర్వంగా ఉంది నాన్న’ అని చెప్పాడు. మదర్-సన్ మధ్య ఉన్న ఎమోషన్‌కి ఆడియన్స్ అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు. డైరెక్టర్ ప్రదీప్ గారు మొత్తం క్రెడిట్ కొట్టేశారు. ఆయన ఈ కథను నా దగ్గరికి తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సినిమాను చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థాంక్ యూ,” అన్నారు.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!