NTV Telugu Site icon

NKR 21: కళ్యాణ్ రామ్ సినిమా ఇన్ సైడ్ టాక్..

Nkr21 (2)

Nkr21 (2)

బింబిసారాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆ తర్వాత చేసిన అమిగోస్, డెవిల్ ఆశించిన విజయం సాదించలేదు. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో #NKR21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్‌ రామ్‌ కనిపించబోతున్నారట.

Also Read : AJITH : రికార్డులు తిరగరాసిన అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీజర్

‘‘కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న సినిమా ఇది. అవుట్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రానుంది. ఈ సినిమా వర్క్ ఆల్ మోస్ట్ ఫినిష్ స్టేజ్ కు చేరుకుంది. కానీ ఒకటి అరా పోస్టర్స్ తప్ప కంటెంట్ ఇప్పటి వరకు ఏదీ బయటకు వదలలేదు. కానీ ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో మాత్రం ఈ సినిమా మీద ఆసక్తికరమైన పాజిటివ్ కబుర్లు చాలా వినిపిస్తున్నాయి. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కు మరో అతనొక్కడే, బింబిసారా రేంజ్ సినిమా అవుతుందని, అవుట్ ఫుట్ చాలా బాగా వస్తుందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఈ చిత్రంలో సీనియర్ నటి  విజయశాంతి మరోసారి పవర్‌ఫుల్‌ లేడీ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతుంది. కాగా ఈ సినిమాకు గత కొన్నాళ్లుగా ‘మెరుపు’ అనే టైటిల్ వినిపించగా లెటెస్ట్ గా ‘రుద్ర’అనే మరొక టైటిల్ కూడా అనుకుంటున్నారు అని దాదాపు ఇదే ఖాయమని సమాచారం.