NTV Telugu Site icon

Kalki: కల్కి అన్ స్టాపబుల్ ..అన్ బీటబుల్ రికార్డ్స్..మెుత్తం ఎన్ని కోట్లంటే..?

Untitled Design (42)

Untitled Design (42)

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకు వెళ్తూ రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొడుతుంది. గత నెల 27న విడుదలై నేటికి 5వ వారంలోకి అడుగుపెట్టింది కల్కి.

ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోన్నపెద్ద హీరో సినిమా కల్కి మాత్రమే. ఇటీవల విడుదలైన చిన్న సినిమాలు ఏవి థియేటర్లలో నిలబడలేదు. ఆగస్టు 15న రానున్నరామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్ వచ్చే వరకు కల్కి సినిమాకు థియేటర్ రన్ ఉంటుంది. కాగా   ప్రపంచవ్యాపంగా కల్కి రూ. 1100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మేరకు అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు నిర్మాత అశ్వనిదత్. ఓవర్ సీస్ లో $18 మిలియన్ల క్రాస్ చేసి 20మిలియన్ల దిశగా సాగుతుంది కల్కి. వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్లు కొద్దిగా నెమ్మదించాయి కానీ ఓవర్సీస్ లో మాత్రం స్టడీగా ఉన్నాయి. మరోవైపు నిర్మాత అశ్వనీదత్ కు ఈ చిత్రం లాభాల వరద పారిస్తోంది. వరల్డ్ వైడ్ గా కల్కిసాధించిన కలెక్షన్స్ ప్రకారం నిర్మాత అశ్వినీదత్ కు ప్రస్తుతం అటు ఇటుగా రూ 125 కోట్ల లాభాలు వచ్చాయని తెలుస్తోంది.అటు నైజాంలోను ఈ చిత్రం 80 కోట్ల రూపాయల షేర్ రాబట్టి ప్రభాస్ ను నైజాం నవాబ్ గా నిలిపింది.

Also Read: Nithin : వెబ్ సీరిస్ దర్శకుడితో నితిన్..ఎవరా దర్శకుడు.?