Site icon NTV Telugu

Kalinga : హాట్ టాపిక్ గా చిన్న సినిమా

Kalinga

Kalinga

ప్రస్తుతం సినీ పరిశ్రమలో చిన్న సినిమా అంటే ఒకరకమైన పెదవి విరుపు కనిపిస్తోంది. అదే చిన్న సినిమాలో కంటెంట్ ఉందని తెలిస్తే మాత్రం నెత్తిన పెట్టేసుకుంటున్నారు ఆడియన్స్. ఈ క్రమంలో ‘కళింగ’ సినిమా గురించి టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ధృవ వాయు విభిన్నమైన కథతో… వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న కళింగ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ధ్రువ వాయు ప్రధాన పాత్రలో నటించడమే కాక దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ప్రగ్యా నయన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్నారు.

కాగా ఈ సినిమా టీజర్‌ను ఇటీవల బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతో ఈ సినిమా బిజినెస్‌ కూడా ఊపందుకుందని తెలుస్తోంది. ఈ చిత్రం ఓవర్‌సీస్‌ హక్కలను, ఇప్పటి వరకు పలు బిగ్‌ ప్రాజెక్ట్‌ చిత్రాలను పంపిణీ చేసిన పీహెచ్‌ఎఫ్‌ ఎల్‌ఎల్‌సీ సంస్థ సొంతం చేసుకుందని ఇన్ సైడ్ టాక్. హిందీ రైట్స్‌ కోసం కూడా పలు సంస్థలు పోటీపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ధృవ వాయు ప్రగ్యా నయన్ హీరో, హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆడుకాలం నరేష్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు. లక్ష్మణ్ మీసాల, తనికెళ్ల భరణి, షిజు ఏఆర్, మురళీధర్ గౌడ్, సమ్మెట గాంధీ, ప్రీతి సుందర్ కుమార్, బలగం సుధాకర్, ప్రార్ధిని, సంజయ్ కృష్ణ, హరిశ్చంద్ర తదితరులు ఈ సినిమాలో భాగమయ్యరు.

Exit mobile version