సెలబ్రిటీలు బయటకొస్తే చాలు సందర్భం ఎంటీ అని కూడా చూసుకోకుండా ఫోటోగ్రాఫర్లు గ్యాప్ లేకుండా క్లిక్ మనిపిస్తూనే ఉంటారు. వారు ఎంత సేపు ఉంటే అంత సేపు కెమెరా క్లిక్ మంటూనే ఉంటుంది. అది సినిమా ఈవెంట్ అయినా? మరే ఈవెంట్ అయినా? సరే వృత్తిలో భాగంగా కొన్నిసార్లు ఫోటో గ్రాఫర్లు బిజీగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ అదే ఫోటోగ్రాఫర్లు కొన్నిసార్లు హద్దు మీరుతున్నారనే విమర్శలు కూడా చాలా వార్తలో విన్నాం. అయితే ఇలాంటి ఫోటోగ్రాఫర్ల ప్రవర్తన మీద తాజాగా బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కాజోల్ ఆగ్రహం వ్యక్తం చేసింది..
Also Read : Madhubala : ముద్దు సన్నివేశంపై మధుబాల ఓపెన్ కామెంట్స్..
‘ప్రస్తుతం చాలా మంది సెలబ్రిటీలకు ఎదురుకుంటున్న సమస్య పపరాజీ కల్చర్. ఈ ఫోటో గ్రాఫర్ల గురించి నాకు కొంత అవగాహన ఉంది. వారు రాకూడని ప్రదేశాలు కొన్ని ఉంటాయి. ఓ సెలబ్రిటీ అంత్యక్రియల్లో పాల్గనడానికి వచ్చినా? వెంట పరిగెత్తి మరీ ఫోటోలు తీస్తుంటారు. అప్పుడు చాలా వింతగా అనిపిస్తుంది. వాళ్లపై చాలా కోపం వస్తుంది. విలువలు లేకుండా చేసే ఈ పనులేంటని అనాలనిపిస్తుంది. కానీ గట్టిగా ఏం అనలేం. నేను అంద రిలా సాధా రణ మహిళ అయితే వాళ్లందరిపై పోలీసులకు ఫిర్యాదు చేసేదాన్ని. నేను ఆ పనిచేయ లేకపోతున్నందుకు బాధగా ఉంది. అంత్యక్రియల్లోనైనా రెండు..మూడు ఫోటోలు తీసుకోవడంలో తప్పులేదు. అందుకు ఎవరూ కాదనరు. కానీ కొందరు అక్కడ పరిస్థితులు అర్దం చేసుకోకుండా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటివి నాకు చాలా సందర్భాలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.’ అని తెలిపింది.
