Site icon NTV Telugu

షారుఖ్ తో కాజోల్… నిజం కాదంటోన్న సీనియర్ బ్యూటీ!

Kajol response on rumours about movie with Shah Rukh Khan

ఒకసారి రెండు సార్లు కాదు… అర డజను సార్లు షారుఖ్, కాజోల్ బ్లాక్ బాస్టర్స్ అందించారు. ‘బాజీగర్, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, కరణ్ అర్జున్, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, మై నేమ్ ఈజ్ ఖాన్’… ఇవన్నీ ఎస్ఆర్కే, కాజోల్ సూపర్ హిట్సే! అందుకే, వారిద్దర్నీ బాలీవుడ్స్ బెస్ట్ జోడీ అంటుంటారు. అయితే, 2015లో చివరిసారిగా ‘దిల్ వాలే’ సినిమాలో కలసి నటించారు ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక అప్పట్నుంచీ మళ్లీ ఎప్పుడూ షారుఖ్, కాజోల్ కాంబినేషన్ మాట వినిపించలేదు….

Read Also : ఆషాఢ మాసంలో అమ్మవారిగా అలనాటి నటి రేఖ!

ప్రస్తుతం ‘పఠాన్’ చిత్రంతో బిజీగా ఉన్న షారుఖ్ ఖాన్ నెక్ట్స్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సినిమా చేస్తాడని టాక్ వినిపిస్తోంది. అయితే, అందులో మరోసారి బాలీవుడ్ బాద్షాతో కాజోల్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తుందని పుకార్లు గుప్పుమన్నాయి. కానీ, తాజాగా వాటికి చెక్ పెట్టేసింది కాజోల్ దేవగణ్. రాజ్ కుమార్ హిరానీ సినిమా ఆఫర్ తన వద్దకు రాలేదని స్పష్టంగా ఆమె చెప్పేసింది. అలాగే, షారుఖ్ మూవీ అనే కాదు…. ఇంకే చిత్రమూ తాను సైన్ చేయలేదని సీనియర్ యాక్ట్రస్ క్లారిటీ ఇచ్చింది. కొత్త ఐడియాస్, స్క్రిప్ట్స్ మాత్రం వింటోందట. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాజోల్ లాస్ట్ మూవీ ‘తానాజీ’. భర్త అజయ్ తో కలసి నటించింది ఆ సినిమాలో.

Exit mobile version