NTV Telugu Site icon

Satyabhama : కాజల్ ‘సత్య భామ’ రిలీజ్ డేట్ ఫిక్స్..

Kajal Aggarwal

Kajal Aggarwal

Satyabhama : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కెరీర్ ఫుల్ ఫామ్ లో వున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకోని కాజల్ హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.గత ఏడాది బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది.ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ప్రస్తుతం కాజల్ వరుస సినిమాలతో బిజీ గా వుంది.ఇదిలా ఉంటే కాజల్ నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ “సత్యభామ”..

Read Also :Kajal Aggarwal : ఆ సమయంలో అతడు చేసిన పనికి షాక్ అయ్యాను..

ఇందులో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించింది.ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ,సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది.ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించాడు.క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్ వంటి తదితరులు ముఖ్య పాత్ర పోషించారు.ఇదిలా వుంటే ఈ సినిమా రిలీజ్ మే నెలాఖరున అంటే మే 31 ఉంటుందని అంతా భావించారు.తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.సత్య భామ మూవీ “జూన్ 7 ” న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.