‘పక్కా లోకల్ పాప’ ప్రభాస్ పక్కన చేరి చిందులేయనుందా? అవుననే అంటున్నారు! కాజల్ అగర్వాల్ ఐటెం సాంగ్ ఇప్పుడు చర్చగా మారింది. ప్రభాస్, శ్రుతీ హసన్ జంటగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ మూవీ రానున్న సంగతి మనకు తెలిసిందే. ఆ సినిమాలో మిసెస్ కాజల్ మాసెస్ ని ఎంటర్టైన్ చేసేలా మస్తీ ఐటెం సాంగ్ చేయనుందట! దీనిపై ఇంకా అఫీషియల్ ఇన్ ఫర్మేషన్ లేదు. కానీ, టాలీవుడ్ నుంచీ బాలీవుడ్ దాకా ‘ప్రభాస్ మూవీలో కాజల్’ అంటూ గాసిప్స్ మాత్రం చక్కర్లు కొడుతున్నాయి.
కాజల్ గతంలో ‘డార్లింగ్’ ప్రభాస్ పక్కన హీరోయిన్ గా చేసింది. అయితే, ‘పక్కా లోకల్’ బ్యూటీ ఇంత వరకూ యంగ్ రెబెల్ స్టార్ తో ఐటెం నంబర్ పై చిందులేయలేదు. ‘సలార్’ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది కాబట్టి కాజు బేబీ స్పెషల్ సాంగ్ కి ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువ. ఇన్ ఫ్యాక్ట్ ప్రశాంత్ నీల్ గత చిత్రం ‘కేజీఎఫ్’ చాప్టర్ వన్ లో తమన్నా ఐటెం నంబర్ చేసింది. ఆ ఒక్క పాటతో ‘కేజీఎఫ్’ హీరోయిన్ కంటే ఎక్కువే టాక్ సంపాదించుకుంది. ‘సలార్’లో కాజల్ ఆడిపాడినా అలాగే మాస్ రెస్పాన్స్ లభిస్తుందని భావిస్తున్నారు!
‘సలార్’ కంటే ముందు ప్రభాస్ ‘రాధేశ్యామ్’తో జనం ముందుకు రానున్నాడు. ఇక కాజల్ అగర్వాల్ మెగాస్టార్ ‘ఆచార్య’ మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయనుంది.
