The India Story: జూలై 24న కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాజల్ అగర్వాల్, నటుడు శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరి’ (The India Story: Slow Poison in Progress). దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే సమకాలీన అంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ గ్రిప్పింగ్ సోషియో-నేషనల్ డ్రామా విడుదలకు ముహూర్తం ఖరారైంది. జీ స్టూడియోస్, ఎంఐజి ప్రొడక్షన్ & స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చేత్తన్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కాబోతుండటం విశేషం.
కుటుంబ కథా చిత్రాలు, వినోదానికే ప్రాధాన్యత ఇస్తున్న మేకర్స్ ఒకపక్క ఉండగా మరోపక్క ఇప్పుడు సమాజానికి మేలు చేసే వాస్తవ గాథలపై దృష్టి పెడుతున్నారు. ‘ది ఇండియా స్టోరి’ కూడా అటువంటి కోవకే చెందుతుంది. కెమికల్స్ దుర్వినియోగం, సాగులో పురుగుమందుల మితిమీరిన వినియోగం, దీని వెనుక ఉన్న భారీ కుంభకోణాల చుట్టూ ఈ కథ సాగుతుంది. నేటి ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బలమైన సందేశం, ఆలోచింపజేసే స్క్రీన్‌ప్లే, మరియు స్టార్ నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో వస్తున్న ‘ది ఇండియా స్టోరి’ బాక్సాఫీస్ వద్ద కూడా తన ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!