“రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్”… ఫ్యాన్స్ కు పండగే ఇక !

షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో “ఆర్ఆర్ఆర్” బృందం ప్రమోషన్లను స్టార్ట్ చేస్తోంది. దాదాపు మూడు సంవత్సరాల నుంచి షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లు, హీరోల క్యారెక్టర్ కు సంబంధిచిన టీజర్లను మినహాయించి ఏమీ విడుదల చేయలేదు. ఎట్టకేలకు జూలై 15న ఉదయం 11 గంటలకు “ఆర్‌ఆర్‌ఆర్” మేకింగ్ వీడియోను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేకింగ్ వీడియోకు ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్నీ ప్రకటిస్తూ వారు పోస్ట్ చేసిన పోస్టర్ ఆసక్తిని పెంచేస్తోంది.

Read Also : “ఏజెంట్” రెడీ అవుతున్నాడు… మరి మీరు ?

రెండు పాటలు మినహా “ఆర్‌ఆర్‌ఆర్” షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ రెండు ట్రాక్‌లను త్వరలో చిత్రీకరించనున్నారు. ముందుగా అనుకున్నదాని ప్రకారం 2021 అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ పాత్రలకు రెండు భాషల్లో డబ్బింగ్ పూర్తి చేసేశారు. కాగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న “ఆర్ఆర్ఆర్”లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ దేవ్‌గన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-