Kabali Producer KP Chowdary: టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. ఇప్పట్లో డ్రగ్స్ నీడ వీడేలా కనిపించడం లేదు. డగ్స్ కేసులో సినీ పరిశ్రమకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత కేపీ చౌదరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి కొకైన్ స్వాధీనం చేసుకోవడంతో సంచలనంగా మారింది.
Read also: Vikarabad Sireesha Case: అనుమానమే నిజమైంది.. నాలుగు రోజులకు వీడిన శిరీష మిస్టరీ కేసు
తమిళంలో రజనీకాంత్ నటించిన కబాలి చిత్రాన్ని తెలుగులో కెపి.చౌదరి విడుదల చేశారు. కొంతకాలంగా గోవాలో ఉంటున్నాడు. అతనికి సంబంధించిన డ్రగ్స్ ముఠా సైబరాబాద్ పోలీసులకు చిక్కింది. కేపీ చౌదరి డ్రగ్స్ వాడుతున్నట్లు తేలడంతో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొన్నాళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసుల్లో ప్రముఖులు చిక్కుకున్నారనే వార్తలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఈడీ పలువురు సినీ ప్రముఖులను విచారించింది. వారిలో దర్శకుడు పూరీ జగన్నాథ్, రవితేజ, ఛార్మి, నవదీప్, తరుణ్, సుబ్బరాజు, నందు, తనీష్ ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఫోరెన్సిక్ వారికి క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి డ్రగ్స్ కేసులో నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది.