Kaaka Update: ‘కాకా’లో స్పెషల్ సాంగ్.. రితికాతో ‘మెగాస్టార్’ మాస్ స్టెప్పులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi, Rithika Singh in Kaka Special Song: ‘మెగాస్టార్’ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే అప్డేట్. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘కాకా’ ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్న కోణాలున్న పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రత్యేక గీతం చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. ‘గురు’ ఫేమ్ రితికా సింగ్‌తో కలిసి చిరంజీవి ఈ పాటలో సందడి చేసినట్లు తెలుస్తోంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో కాకా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రీ, కూతురి అనుబంధం ప్రధానంగా సాగే కథకు భారీ యాక్షన్ సన్నివేశాలను జోడించి బాబీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో చిరంజీవి ‘సూపర్వైజర్ సత్యం’, ‘కదిరి కాళిదాస్’ అనే రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఓ ప్రత్యేక పాట చిత్రీకరణ పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో ఈ పాటను చిత్రీకరించినట్లు సమాచారం. ఇందులో రితికా సింగ్‌తో కలిసి చిరంజీవి స్టెప్పులు వేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకు నృత్యరీతులు అందించారట. తనదైన స్టైల్, ఎనర్జీతో చిరంజీవి ఈ పాటలో అదరగొట్టారని.. ఈ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చిత్రవర్గాల సమాచారం. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Also Read
- Box Office Clash: టాప్ హీరోయిన్స్ మధ్య వార్.. స్టార్ బ్యూటీల్లో గెలిచేదెవరు?
- Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
- Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
- Allu Arjun: దుల్కర్ ఒక స్టార్ కిడ్ అయినా ఆ పొగరు ఏమాత్రం ఉండదు
కాకాలో చిరంజీవి కూతురి పాత్రలో మలయాళ నటి అనస్వర రాజన్ నటిస్తున్నారు. ప్రియమణి, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా కనిపించనుండగా.. మలయాళ స్టార్ మోహన్‌లాల్ అతిథి పాత్రలో నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో కాకాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Kaaka Update: ‘కాకా’లో స్పెషల్ సాంగ్.. రితికాతో ‘మెగాస్టార్’ మాస్ స్టెప్పులు!
-
Low Cost House Construction: రూ.5 లక్షలకే సొంత ఇల్లు.. ఇటుకలు, సిమెంట్ లేకుండానే నిర్మాణం..? అద్భుతమైన టెక్నాలజీ!
-
Rohit-Kohli: రోహిత్, కోహ్లీలకు చివరిసారి.. కివీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
RBI Loan Rules: చిన్న మొత్తాల్లో రుణాలు తీసుకునే వారికి గుడ్ న్యూస్.. మైక్రోఫైనాన్స్ లోన్ నిబంధనలను మార్చనున్న RBI?
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
ట్రెండింగ్
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..