KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

Kaaka

Kaaka

KAAKA: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ కావడంతో కాకాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ‘కాకా’ షూటింగ్‌కు సంబంధించి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో స్టార్ట్ కానుందని వెల్లడించారు. సుదీర్ఘంగా సాగనున్న ఈ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలతో పాటు హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ నారాయణ నిర్మిస్తున్నారు. షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తూ 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరికొత్త లుక్‌లో కనిపించనుండగా.. అనస్వర రాజన్, నివేతా పేతురాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ‘కాకా’పై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజా షూటింగ్ షెడ్యూల్ అప్‌డేట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్ మారనుందనే వార్తలకు తాజాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను 2027 సంక్రాంతి బరిలో దింపుతున్నట్లు తాజా అప్డేట్‌తో మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రావడం లేదనే రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సంక్రాంతికి పలు పెద్ద సినిమాలు ఉండటంతో థియేటర్ల సర్దుబాటు, పోటీ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కాకా మేకర్స్ రిలీజ్ వాయిదా వేసే దిశగా ఆలోచిస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. సంక్రాంతి హడావుడిని తప్పించి, బాక్సాఫీస్ వద్ద సోలోగా మెగా మాస్ విధ్వంసం సృష్టించేందుకు వీలుగా ‘కాకా’ను 2027 సమ్మర్ సీజన్‌కు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని పలువురు పోస్ట్‌లు చేశారు. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ అప్డేట్‌తో పాటు ఈ రూమర్స్‌పై కూడా కార్లిటీ ఇచ్చారు. ఈ మెగా మూవీ పక్కా జనవరి 13, 2027 తేదీనే థియేటర్స్‌లోకి రాబోతుందని స్పష్టం చేశారు. దీంతో కాకా రిలీజ్ వాయిదా అనే ప్రచారానికి ఫుల్‌స్టాఫ్ పడినట్లు అయ్యింది.