“KA Mass Jathara” Full Video Song from Kiran Abbavaram’s KA released: యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.
Duvvada Srinivas-Madhuri: తిరుమలలో దువ్వాడ – మాధురి ప్రీ వెడ్డింగ్ షూట్
ఈ రోజు “క” సినిమా నుంచి ‘మాస్ జాతర’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను సామ్ సీఎస్ మంచి బీట్ తో కంపోజ్ చేశారు. సనాపాటి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ అందించగా..దివాకర్, సామ్ సీఎస్, అభిషేక్ ఏఆర్ పాడారు. ‘ఆడు ఆడు ఆడు ఆడు నిలువెల్లా పూనకమై ఆడు..ఆడు ఆడు ఆడు ఆడు ఆడు అమ్మోరే మురిసేలా ఆడు.. ఆడు ఆడు ఆడు ఆడు ఊరు వాడ అదిరేలా ఆడు..’ అంటూ పూనకాలు తెప్పించేలా సాగుతుందీ పాట. పొలాకి విజయ్ ది బెస్ట్ కొరియోగ్రఫీ చేశారు. ‘మాస్ జాతర ‘ పాటలో హీరో కిరణ్ అబ్బవరం మాస్ ఎనర్జిటిక్స్ స్టెప్స్ హైలైట్ అవుతున్నాయి. ఆయనతో పాటు హీరోయిన్స్ తన్వీ రామ్, నయన్ సారిక అదిరే డ్యాన్స్ లు చేశారు. థియేటర్ లో ఈ పాట ఆడియెన్స్ తో స్టెప్స్ వేయించనుంది. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు.