Site icon NTV Telugu

K Ramp: ఓటీటీలోకి కే ర్యాంప్.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?

K Ramp Ott

K Ramp Ott

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘కే Ramp’ సినిమా, దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుంచీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, కిరణ్ అబ్బవరంకి మరో హిట్ అందించింది. గట్టిగానే కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా, ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమా నవంబర్ 15వ తేదీ, అంటే వచ్చే శనివారం నాడు, ఆహాలో స్ట్రీమింగ్కి రెడీ అవ్వనుంది. ఈ మేరకు ఆహా ద్వారానే అధికారిక ప్రకటన కూడా రానుంది. నాని డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి, రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరించారు.

Also Read :Dies Irae Review Telugu : డీయస్ ఈరే రివ్యూ: ప్రణవ్ మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే?

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, నిర్మాత రాజేష్ చేసిన వ్యాఖ్యలు సినిమాకి మరింత మైలేజ్ తీసుకొచ్చాయి. ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పిన అవి కూడా వైరల్ అయ్యాయి. మొత్తం మీద ‘కే రామ్’ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుని, కలెక్షన్స్ రాబట్టినా కూడా, 28 రోజులలోపే ఓటీటీలోకి రాబోతూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ విషయం మీద సరైన ఆలోచన చేయకుంటే, భవిష్యత్తులో పెద్ద సినిమాలకు కూడా, ఈ ఓటీటీ విండో ఇబ్బందికరంగానే మారే పరిస్థితి కనిపిస్తోంది.

Exit mobile version