Site icon NTV Telugu

K Ramp: క రికార్డ్ బద్దలు కొట్టలేక పోయిన కె ర్యాంప్

Kiran Abbavaram K Ramp

Kiran Abbavaram K Ramp

దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన “K-ర్యాంప్” మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిందని సినిమా టీం ప్రకటించింది. దీపావళి సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినట్లు పేర్కొన్నారు. శనివారం థియేటర్లలోకి వచ్చిన “K-ర్యాంప్”, విడుదలైన మొదటి రోజునే మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ సినిమా ₹4.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి, తన బ్లాక్ బస్టర్ జర్నీని మొదలుపెట్టింది. ఈ వసూళ్లతో దీపావళి బాక్సాఫీస్ విన్నర్‌గా “K-ర్యాంప్” నిలిచింది. అయినా కిరణ్ క సినిమా మొదటి రోజు వసూళ్లను టచ్ చేయలేకపోయింది. ఆ సినిమా 6.13 కోట్లు సాధించడం గమనార్హం.

Also Read :Prabhas – Sukumar: సుక్కు – ప్రభాస్ కాంబో సెట్టు.. బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో!

“K-ర్యాంప్” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా పూర్తి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ విజయం సాధించింది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ ఉన్న ఫస్టాఫ్, ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్ ఉన్న సెకండాఫ్. … ప్రేక్షకులను థియేటర్లలో బాగా ఆకట్టుకుంటున్నాయి. పండుగ సెలవుల కారణంగా “K-ర్యాంప్” బాక్సాఫీస్ వద్ద మరిన్ని డీసెంట్ నెంబర్లను క్రియేట్ చేయనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Exit mobile version