Site icon NTV Telugu

NTR : అమెరికాలో షూటింగ్..కాన్సులేట్‌కు ఎన్టీఆర్‌

Jr Ntr

Jr Ntr

ఎన్టీఆర్‌ ఏమాత్రం మారలేదు. సన్నబడి ఫేస్‌లో కళ పోగొట్టుకున్నాడంటూ కామెంట్స్‌ వచ్చినా.. అదే లుక్‌ మెయిన్‌టేన్‌ చేస్తున్నాడు తారక్‌. ఈలుక్‌తోనే ప్రశాంత్‌నీల్‌ కొత్త షెడ్యూల్లో జాయిన్‌ అవుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రశాంత్‌ నీల్‌ షూటింగ్‌ దగ్గరపడడంతో మళ్లీ వర్కవుట్స్‌ స్టార్ట్‌ చేశాడు తారక్‌. వార్‌2 రిలీజ్‌ కోసం గ్యాప్‌ తీసుకున్న తారక్‌ మళ్లీ ఫిట్‌నెస్‌పై శ్రద్దపెట్టాడు. జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్న వీడియోను అతని పర్సనల్ జిమ్ ట్రైనర్ పోస్ట్‌ చేశాడు.

Also Read :Jr NTR: నీ బాడీ బాక్స్ ఆఫీస్ అంతే!

ప్రశాంత్‌నీల్‌ సినిమాను అమెరికా షూట్‌ చేయనున్నట్టు తెలిసింది. దీనికోసమే తారక్‌ అమెరికా కాన్సులేట్‌కు వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫొటోలను యుఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ లారా విలిమయ్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కాన్సులేట్‌లోకి ఎన్టీఆర్‌ను స్వాగతించడం ఆనందంగా వుందని రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్లో వైరల్‌ అవుతున్నాయి. ప్రశాంత్‌ నీల్‌ సినిమా కోసం ఎన్టీఆర్‌ బరువు బాగా తగ్గాడు. అయితే సినిమా మొత్తం ఇదే గెటప్‌లో కనిపించడని, వెయిట్‌ పెరిగిన కొన్ని సీన్స్‌ తర్వాత తీస్తారని అంటున్నారు. ఎలివేషన్స్‌ కి పెట్టింది పేరైన దర్శకుడు ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తాడన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు అభిమానులు.

Exit mobile version