Site icon NTV Telugu

Devara 2 : దేవర 2పై షాకింగ్ న్యూస్?

Devara 2

Devara 2

జూనియర్ ఎన్టీఆర్ తాజాగా “వార్ 2” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ సంగతి అలా ఉంచితే, ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న “డ్రాగన్” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్లో రిలీజ్ కావాల్సి ఉంది.

అయితే, ఎన్టీఆర్ గత చిత్రం “దేవర” సక్సెస్‌గా నిలుస్తూ మంచి కలెక్షన్స్ రాబట్టిన నేపథ్యంలో, అప్పట్లోనే సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే ఈ సెకండ్ పార్ట్‌కి సంబంధించి స్క్రిప్ట్ లాక్ చేసిన కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా వినిపించారు. ఆయన కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎప్పుడెప్పుడు ప్రశాంత్ నీల్‌ సినిమా నుంచి వస్తాడా, అప్పుడు షూట్ మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారు.

అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఎన్టీఆర్ “దేవర 2” సినిమాని ఆపేయాలని భావిస్తున్నాడట. ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉందని, అలాగే ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్‌తో మరో సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సినిమా చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికైతే సినిమా పూర్తిగా ఆపేశారని అలా అని ఉంటుందని చెప్పలేం. కాబట్టి, ఇప్పట్లో అయితే సినిమా ఉండే అవకాశం లేదని చెప్పొచ్చు. ఇక, నాగచైతన్య కోసం కొరటాల శివ మరో స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

Exit mobile version