Junior NTR New Look: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కించిన RRR సినిమాతో ఆయన అంతర్జాతీయ స్థాయిలో మంచి ఖ్యాతిని గడించారు. ఈ మూవీతో ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై నడిచి వరల్డ్ వైడ్ గా సినీ ప్రేమికుల దృష్టిని యంగ్ టైగర్ ఆకర్షించారు. ముఖ్యంగా జపాన్‌లో ఎన్టీఆర్‌కు ఉన్న ఫ్యాన్‌బేస్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి.. ఇటీవల అక్కడే తన దేవర సినిమాను రిలీజ్ చేసి మంచి స్పందన అందుకున్నారు.
Read Also: Nagabandham : ‘నాగబంధం’ మూవీ నుంచి నభా నటేష్.. డివైన్ ఫస్ట్ లుక్!
అయితే, దక్షిణ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన జూనియర్ ఎన్టీఆర్.. గత ఏడాది బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. హృతిక్ రోషన్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన వార్- 2 సినిమాలో విలన్ రోల్ లో బాలీవుడ్ అభిమానులకు పరిచయం అయ్యారు. ఇక, భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సె్స్ కాలేకపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్, కేజీఎఫ్ సిరీస్‌తో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమాలో యంగ్ టైగర్ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది.
కాగా, ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నారు అనే ఇంట్రెస్ ఫ్యాన్స్ లో నెలకొంది. మధ్య మధ్యలో బయటకు వస్తున్న ఆయన లుక్స్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దేవర మూవీతో కాస్త బొద్దుగా కనిపించిన తారక్, ఈ చిత్రం కోసం బరువు తగ్గినట్లు కనిపిస్తుంది. ఇటీవల తన బావమర్ది నార్నే నితిన్ పెళ్లిలో కనిపించినప్పుడు అతడి లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇక, ఓ జువెలరీ బ్రాండ్ ప్రమోషన్‌లోనూ ఎన్టీఆర్ కొత్త మేకోవర్ పై కూడా చర్చ కొనసాగుతుంది.
అలాగే, తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కెమెరాల కంట పడ్డాడు జూనియర్ ఎన్టీఆర్.. ఈ ఫోటోల్లో ఊర మాస్ గెటప్‌లో అభిమానులను అలరించేలా కనిపిస్తున్నాడు. పవర్‌ఫుల్ లుక్‌తో కనిపించిన తారక్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారాయి. ఈ కొత్త మేకోవర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తన తదుపరి మూవీ కోసమేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంక్రాంతికి అసలైన ఎన్టీఆర్ లుక్ బయటకు వచ్చిందని అభిమానులు ఈ ఫోటోలను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.
