Site icon NTV Telugu

Jr NTR: ఎన్టీఆర్ బక్క చిక్కడానికి అనారోగ్యమే కారణమా?

Jr Ntr

Jr Ntr

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘దేవర’ జపాన్ ప్రమోషన్స్, ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్, ‘అర్జున్ సన్నాఫ్’ వైజయంతి ప్రీ రిలీజ్ మీట్‌లలో ఎన్టీఆర్ బక్కచిక్కిన రూపంలో కనిపించడంతో, కొన్ని మీడియా వర్గాలు ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని వార్తలు వండి వార్చాయి. అయితే, అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఎన్టీఆర్ కొత్త లుక్ వెనుక ఉన్న రహస్యం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ‘డ్రాగన్’ సినిమా కోసమేనని ఆయన టీం స్పష్టం చేసింది. ఎన్టీఆర్ గత చిత్రాలైన ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘దేవర’, మరియు ‘వార్ 2’లో బలిష్టమైన శరీరాకృతితో, రగ్గడ్ లుక్‌లో కనిపించారు. అయితే, ‘డ్రాగన్’ సినిమాలో పూర్తిగా భిన్నమైన పాత్ర కోసం ఆయన భారీగా బరువు తగ్గారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలు సాధారణంగా కండలతో, బలమైన రూపంలో కనిపిస్తారనే అభిప్రాయం ఉన్నప్పటికీ, ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్‌ను సన్నగా, లీన్ లుక్‌లో చూపించాలని నీల్ నిర్ణయించారని టాక్.

JR NTR : వార్-2లో ఎన్టీఆర్ షర్ట్ లెస్ యాక్షన్..?

ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ కఠినమైన డైట్, వర్కవుట్ రొటీన్‌ను అనుసరించి, శరీర ఆకృతిని పూర్తిగా మార్చుకున్నారని అంటున్నారు. ఇక ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసిన అభిమానులు ఒకవైపు ఆశ్చర్యపోతూనే, ఆయన అంకితభావంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తోంది యూనిట్. ఏప్రిల్ 22, 2025 నుంచి ఎన్టీఆర్ కూడా సెట్స్‌లో జాయిన్ కానున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు.

Exit mobile version