NTV Telugu Site icon

Jr. NTR : యంగ్ టైగర్ – వెట్రి మారన్ – Sun పిక్చర్స్.. ఫిక్స్..?

Untitled Design (3)

Untitled Design (3)

యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ఓ ఈవెంట్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తారక్ తమిళ స్ట్రయిట్ సినిమా పై యాంకర్ ప్రశించగా తారక్ మాట్లాడుతూ ‘ వెట్రిమారన్ త్వరగా నాతో సినిమా చేస్తే తెలుగులో డబ్బింగ్ చేసుకుంటాను’ అని అన్నాడు. వాస్తవానికి వెట్రిమారన్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎప్పుడో నటించాల్సి ఉంది. తారక్ కు కథ వినిపించడం కూడా జరిగింది. కాని ఈ చిత్రం పట్టాలెక్కలేదు.

Also Read : AditiShankar : టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెడుతున్న దర్శకుడు ‘శంకర్’ కూతురు..

RRR అనుకున్న టైమ్ కు రిలీజ్ కాకపోవడంతో వెట్రి మారన్ ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు యంగ్ టైగర్ హీరోగా, వెట్రిమారన్ దర్శకత్వంలో సినిమా తప్పకుండా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మరొక హీరోకు కూడా అవకాశం ఉందని ఆ రోల్ కోసం తమిళ నటుడు ధనుష్ ను అనుకున్నారని సమాచారం. ఈ బ్లాక్ బస్టర్ కాంబోలో రానున్న సినిమా KGF ( కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) నేపథ్యంలో సాగుతుందని టాక్. ఈ భారీ బడ్జెట్ సినిమాను తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనుందట. వెట్రిమారన్ సినిమాల్లో అనవసరపు కమర్షియల్ ఎలిమెంట్స్ వంటివి ఉండవు , అలాగే తారక్ నుండి ఈ విధమైన మాస్ అయితే కోరుకుంటారో అన్ని ఉండేలా ఈ సినిమాను తెరకెక్కిస్తారట. అన్ని అనుకున్నట్టు జరిగితేత్వరలో ఈ సినిమా వుండే అవకాశం ఉంది.మరో వైపు వార్ -2 తో బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ లో నటిస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీయార్

Show comments